ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | అన్ని వర్గాలను ఆగం చేసిన రేవంత్​రెడ్డి ప్రభుత్వం

    Mla Prashanth Reddy | అన్ని వర్గాలను ఆగం చేసిన రేవంత్​రెడ్డి ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Mla Prashanth Reddy | అమలు చేయలేని హామీలు ఇచ్చి రేవంత్​రెడ్డి(Revanth Reddy) అన్నివర్గాలను ఆగం చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్(KCR) హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని, రేవంత్ రెడ్డి 500 రోజుల్లోనే దాన్ని 11వ స్థానానికి చేర్చాడని దుయ్యబట్టారు.

    గత పదేళ్లలో జీఎస్టీ(GST) వృద్ధిరేటులో రాష్ట్రం మూడో స్థానంలో ఉంటే, రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో 14వ స్థానంలోకి దిగజారిపోయిందన్నారు. మహిళల పెన్షన్, తులం బంగారం అడిగితే లాఠీఛార్జ్ చేసి 33 మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు అమలు కావడంలేదని ఆరోపించారు. తెలంగాణ(Telangana) కంటే 25 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయని చెప్పారు. కేసీఆర్ పదేళ్లలో రూ. నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే.. రేవంత్​ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రూ. 1.85 లక్షల అప్పు చేసిందని విమర్శించారు. కనీసం రూ. ఐదు, పది లక్షల పెండింగ్​ బిల్లులను కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదన్నారు.

    Mla Prashanth Reddy | బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం..

    బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని ప్రశాంత్​ రెడ్డి అన్నారు. ఉద్యమం కేసీఆర్(KCR) ఒక్కడితోనే ప్రారంభమైందని, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలను జాగృతి పరుస్తూ తెలంగాణను సాధించి పెట్టారన్నారు. వరంగల్ సభ(Warangal Sabha) కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 ఆర్టీసీ బస్సులను(RTC buses) బుక్ చేసుకున్నామని, మరో 250 ప్రైవేటు బస్సులు, 680 టాక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 1260 సొంత కార్లలో సభకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Former MLA Baji Reddy Govardhan) మాట్లాడారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్, మాజీ మేయర్ నీతూ కిరణ్, ప్రభాకర్, యువ నాయకుడు జగన్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...