Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kharge Jaggareddy Meeting | కాంగ్రెస్​ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల గురించి ఆయనతో చర్చించారు.

రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్​ సీనియర్​నేత అభిషేక్​ సింగ్​ మన్వీ, బీఆర్​ఎస్​ నాయకుడు కేఆర్​ సురేష్​రెడ్డి పదవీ కాలం కానుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్​ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పలువురు రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. అయితే ఒకస్థానాన్ని అభిషేక్​ సింగ్​కు కేటాయించనట్లు సమాచారం. దీంతో మరో స్థానానికి తీవ్ర పోటీ ఉంది. ఈ క్రమంలో జగ్గారెడ్డి మల్లికార్జున్​ ఖర్గే (Mallikarjun Kharge)తో చర్చించారు.

Kharge Jaggareddy Meeting | వారికి అవకాశం ఇవ్వాలి

తెలంగాణ (Telangana)లో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాల గురించి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్​, కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జీ మీనాక్షి నాటరాజన్​తో చర్చించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా ఖర్గేను కలిశారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్​కు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన కోరారు. రాహుల్​ గాంధీ (Rahul Gandhi)ని సైతం ఆయన కలవాలని ఢిల్లీ వెళ్లారు. అయితే రాహుల్​ బిజీగా ఉండటంతో కలువలేకపోయారు.

మల్లికార్జున ఖర్గేను కలిసి వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని వివరించారు. హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారని, మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...