HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంది. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 2700 గ‌జాల స్థ‌లాన్ని కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండ‌లం నెక్నాంపూర్ గ్రామంలో 31వ స‌ర్వే నంబ‌రులో 59.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. స‌చివాల‌య ఉద్యోగులకు ప్ర‌భుత్వం 2002లో ఈ భూమిని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంది. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 2700 గ‌జాల స్థ‌లాన్ని కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది.

రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండ‌లం నెక్నాంపూర్ గ్రామంలో 31వ స‌ర్వే నంబ‌రులో 59.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. స‌చివాల‌య ఉద్యోగులకు ప్ర‌భుత్వం 2002లో ఈ భూమిని కేటాయించింది. 2007లో హుడా లే అవుట్​ కూడా వేశారు. లే అవుట్​లో 2700 గ‌జాల స్థలాన్ని పార్కుతో పాటు.. ప్ర‌జావ‌స‌రాల‌కు అప్ప‌ట్లో కేటాయించారు. గుట్ట‌లా ఉండే ఈ స్థలంలో పార్కు ఏర్పాటు చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకున్నా కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి యత్నించారు.

HYDRAA land protection | అక్రమ నిర్మాణం

స‌చివాల‌య ఉద్యోగుల కాల‌నీకి ఆనుకుని స‌ర్వే నంబ‌రు 22లో వెంక‌టేశ్వర కాల‌నీ ఉంది. ఓ వ్యక్తి ఈ కాల‌నీలోని ప్లాట్‌ను చూపిస్తూ నిర్మాణ అనుమ‌తి తెచ్చుకున్నాడు. సదరు వ్యక్తులు అనుమతి తెచ్చుకున్న ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణం ఉంది. అయితే దానిని చూపించి స‌చివాల‌య ఉద్యోగుల కాల‌నీలోని పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లంలో నిర్మాణాలు చేపట్టాడు. పునాదుల‌తో పాటు.. పిల్ల‌ర్లు వేసి.. స్లాబ్ వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. పార్కు స్థలం కబ్జాపై కాల‌నీ సంక్షేమ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు ఆక్రమణలను గురువారం తొలగించారు. అంతేగాకుండా గుట్ట‌ను ప్లాట్లుగా చేసి కొంత‌మంది అప్ప‌టి ప్ర‌తినిధులు అమ్మేసిన మ‌రో 5 ప్లాట్ల‌లో వేసిన తాత్కాలిక షెడ్డుల‌ను తొలగించారు. మొత్తం 2700 గ‌జాల మేర స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...