BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

అక్షరటుడే, ఆర్మూర్​: BC Reservations Congress | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ (Eeravatri Anil) అన్నారు. ఆర్మూర్​ బల్దియా ఛైర్​పర్సన్​ లహరి, వైస్​ ఛైర్మన్​ కాట్​పల్లి వెంకట రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.

BC Reservations Congress | బీసీ మహిళలకు బల్దియా పీఠాలు..

ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్​ మాట్లాడుతూ.. జిల్లాలోని బోధన్​, ఆర్మూర్​, భీమ్​గల్​లలో బీసీ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తే కేంద్రంలో మోకాలడ్డు పెడుతోందన్నారు. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయట్లేదని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీల్లోనే వ్యక్తులే కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 64శాతం వరకు బీసీలకు బల్దియా పీఠాలను అప్పజెప్పిన ఘనత కాంగ్రెస్​ పార్టీకి దక్కుతుందన్నారు. ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​రెడ్డి మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఆర్మూర్ ప్రజలు ఇతర పార్టీలను తిరస్కరించి కాంగ్రెస్​కు పట్టం కట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  (Former MLA Jeevan Reddy) మతిభ్రమించి ఆర్మూర్​లో తిరుగుతున్నాడని, జీవన్ రెడ్డిని ఆస్పత్రిలో చూపించాలన్నారు.

టీపీపీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్నా మాట్లాడుతూ..ఎంపీ అర్వింద్​, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్​కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీ పద్మశాలి బిడ్డను ఆర్మూర్ ఛైర్​పర్సన్​గా చేసిన ఘనత కాంగ్రెస్​కు దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ప్రీతికరమైన నియోజకవర్గం ఆర్మూర్ అన్నారు. ఆర్మూర్ నుంచి పాదయాత్ర చేసిన రేవంత్​రెడ్డి సీఎం వరకు ఎదిగారన్నారు. ఎంపీ అర్వింద్​, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారి నిధులనుంచి మున్సిపల్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​ బిన్ హందన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజవర్గంపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాట్​పల్లి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...