Mla Prashanth Reddy | అన్ని వర్గాలను ఆగం చేసిన రేవంత్​రెడ్డి ప్రభుత్వం

అక్షరటుడే, ఇందూరు:Mla Prashanth Reddy | అమలు చేయలేని హామీలు ఇచ్చి రేవంత్​రెడ్డి(Revanth Reddy) అన్నివర్గాలను ఆగం చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్(KCR) హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని, రేవంత్ రెడ్డి 500 రోజుల్లోనే దాన్ని 11వ స్థానానికి చేర్చాడని దుయ్యబట్టారు. గత పదేళ్లలో జీఎస్టీ(GST) వృద్ధిరేటులో రాష్ట్రం మూడో స్థానంలో ఉంటే, రేవంత్ […]

అక్షరటుడే, ఇందూరు:Mla Prashanth Reddy | అమలు చేయలేని హామీలు ఇచ్చి రేవంత్​రెడ్డి(Revanth Reddy) అన్నివర్గాలను ఆగం చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్(KCR) హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని, రేవంత్ రెడ్డి 500 రోజుల్లోనే దాన్ని 11వ స్థానానికి చేర్చాడని దుయ్యబట్టారు.

గత పదేళ్లలో జీఎస్టీ(GST) వృద్ధిరేటులో రాష్ట్రం మూడో స్థానంలో ఉంటే, రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో 14వ స్థానంలోకి దిగజారిపోయిందన్నారు. మహిళల పెన్షన్, తులం బంగారం అడిగితే లాఠీఛార్జ్ చేసి 33 మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు అమలు కావడంలేదని ఆరోపించారు. తెలంగాణ(Telangana) కంటే 25 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయని చెప్పారు. కేసీఆర్ పదేళ్లలో రూ. నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే.. రేవంత్​ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రూ. 1.85 లక్షల అప్పు చేసిందని విమర్శించారు. కనీసం రూ. ఐదు, పది లక్షల పెండింగ్​ బిల్లులను కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదన్నారు.

Mla Prashanth Reddy | బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం..

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని ప్రశాంత్​ రెడ్డి అన్నారు. ఉద్యమం కేసీఆర్(KCR) ఒక్కడితోనే ప్రారంభమైందని, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలను జాగృతి పరుస్తూ తెలంగాణను సాధించి పెట్టారన్నారు. వరంగల్ సభ(Warangal Sabha) కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 ఆర్టీసీ బస్సులను(RTC buses) బుక్ చేసుకున్నామని, మరో 250 ప్రైవేటు బస్సులు, 680 టాక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 1260 సొంత కార్లలో సభకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Former MLA Baji Reddy Govardhan) మాట్లాడారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్, మాజీ మేయర్ నీతూ కిరణ్, ప్రభాకర్, యువ నాయకుడు జగన్, తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...