అక్షరటుడే, బోధన్ : Science Fair | మానవులకు ముప్పుగా మారిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. బోధన్ పట్టణంలోని విజయ మేరి పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ను సోమవారం ప్రారంభించారు. బోధన్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు (ZPHS Students) జంక్‌ఫుడ్‌పై కలిగే అనర్థాలను వివరిస్తూ చేసిన ప్రయోగ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
Science Fair | జంక్‌ఫుడ్‌తో జీర్ణవ్యవస్థకు ముప్పు..
మార్కెట్లో లభించే జంక్ ఫుడ్ (Junk Food) తీసుకోవడం మూలంగా మనిషిలోని జీర్ణ వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని విద్యార్థులు తమ ప్రయోగం ద్వారా వివరించారు. జంక్‌ఫుడ్ అనేక రోగాలకు కారణమవుతుందని వారు పేర్కొన్నారు. సుద్దపల్లి జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు అరవింద్, విజయ్, రణ్‌బీర్‌లు ఈ ప్రదర్శన ఇచ్చారు. అనంతరం విద్యార్థులను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అభినందించారు.
