అక్షరటుడే ముప్కాల్: Mupkal Mandal | డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని సంతోష్ ఫౌండేషన్ (Santosh Foundation) అధ్యక్షుడు సంతోష్ పేర్కొన్నారు. ఫౌండేషన్, పోలీస్‌శాఖ (police department) ఆధ్వర్యంలో ఆదివారం యువకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల ప్రజల జీవితం నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
డ్రగ్స్‌తో యువత భవిష్యత్తు నాశనం..
ఈ సందర్భంగా ఎస్సై కె.కిరణ్ పాల్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో యువకులు ముందుండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై గంగారాం, పోలీస్ సిబ్బంది బ్రహ్మ, సాయి, గ్రామస్థులు, శ్రావణ్, నర్సయ్య, రాకేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
