Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Sarees | మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

Indiramma Sarees | మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు. రాజంపేట్ మండలంలోని కొండాపూర్​లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Indiramma Sarees | మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు. రాజంపేట్ మండలంలోని (Rajampet Mandal) కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల (Indiramma Sarees) పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. కొండాపూర్ గ్రామంలో (Kondapur Village) ఇందిరాక్రాంతి మహిళా సంఘాల కార్యకలాపాల కోసం ప్రత్యేక భవన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.