అక్షరటుడే, బాన్సువాడ : MLA Pocharam | మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో (Srinivasa Gardens) గురువారం డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 3,465 మహిళా సంఘాలకు మొత్తం రూ.3.60 కోట్లు వడ్డీలేని రుణ రాయితీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, ఎజాజ్, గౌస్ పాషా, దావుడ్, ఐకేపీ ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
