అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఫ్రిజ్ డోర్ తీస్తుండగా విద్యుత్ షాక్ (Electric Shock) కొట్టి మహిళ మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని రాజేంద్రనగర్ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడ (Hyderaguda) ఎర్రబోడకు చెందిన లావణ్య(40)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేస్తూ కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. ఏడాది క్రితం పెద్ద కుమార్తె వివాహం కూడా చేసింది. పెద్ద కూతురుకు కుమారుడు పుట్టడంతో పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం లావణ్య ఫ్రిజ్ డోర్ తీస్తుండగా.. ఒక్కసారిగా షాక్ కొట్టింది. వెంటనే ఇంట్లోనే ఉన్న పెద్ద కుమార్తె స్థానికుల సాయంతో లావణ్యను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో ఎర్తింగ్ లేకపోవడంతో షాక్ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.