అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
గతంలో ఇంట్లో నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు పోవడంతో కుమార్గల్లీకి చెందిన ఇంటి యజమాని గంగా కిషన్ తన ఇంట్లో సీక్రెట్ కెమెరాను అమర్చుకున్నారు. ఈనెల 13న ఇంటి బెడ్ రూంలోని సేఫ్ లాకర్లో (safe locker) బంగారం, వెండి, కొంత డబ్బులు పెట్టి గంగాకిషన్ తదితరులు బయటకు వెళ్లారు. ఈనెల 19న ఆ బంగారం కోసం చూడగా కనిపించలేదు.
అనుమానంతో సీసీ కెమెరాలు (CCTV cameras) పరిశీలించగా.. వారి ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో పనిచేసే గాయత్రి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో డుబ్లికేట్ తాళంతో ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగదును దొంగిలించుకుని పోయినట్టుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు హారిక అలియాస్ గాయత్రి (37) అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని ఆమె ఒప్పుకుంది. అనంతరం ఆమె వద్ద నుంచి 8 తులాల బంగారం 1300 గ్రాముల వెండి రూ.50 వేల స్వాధీనం చేసుకొన్నారు. గాయత్రిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి పేర్కొన్నారు.
