అక్షరటుడే, కోటగిరి : Kotagiri | మండల కేంద్రంలోని వైన్‌షాప్‌ను (Wine shop) తొలగించాలని కోరుతూ స్థానికులు రాస్తారాకో చేశారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ కార్యాలయం సిబ్బందికి (Tahsildar office staff) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎత్తొండ రోడ్డులోని వినాయక్‌నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ.. తమ కాలనీ ప్రాంతంలో ఉన్న వైన్ షాప్, పర్మిట్ రూంను తొలగించాలని డిమాండ్ చేశారు.
వైన్స్ షాపు కాలనీలోనే ఉండడంతో మహిళలు, స్కూల్ పిల్లలు, కళాశాలకు వెళ్లే యువతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రోడ్లపైనే వాహనాలు ఆపుతూ, తాగి రోడ్లపైనే పడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు అక్కడి నుంచి వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లింగారాం, విజయ్, డాన్ రాజు, సాయిలు, గజ్జు, శ్రీనివాస్, సిరాజ్, అల్మాస్, ముజీబ్, హమీద్, వహీద్, రశీద్ తదితరులు పాల్గొన్నారు.
