Homeతాజావార్తలుKTR | కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తారా.. ఫార్ములా ఈ–రేసు కేసులో ఏసీబీ ఫైనల్​ రిపోర్టు

KTR | కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తారా.. ఫార్ములా ఈ–రేసు కేసులో ఏసీబీ ఫైనల్​ రిపోర్టు

ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్​ డిస్కషన్లతో రేస్ నిర్వహించినట్లు తెలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది. హైదరాబాద్​లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించడం కేటీఆర్ సొంత నిర్ణయమని పేర్కొంది.
బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్​లో ఫార్ములా ఈ–రేసు (Formula E Race) నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఏసీబీ విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన ఏసీబీ తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేటు డిస్కషన్లతో రేస్ నిర్వహించినట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసులో ఏ1 మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్‌, ఏ3 BLN రెడ్డి, ఏ4, ఏ5గా FEO ప్రతినిధులను చేర్చారు.

KTR | బీఆర్​ఎస్​కు రూ.44 కోట్లు

అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విడ్ ప్రో కో జరిగిందని వివరించారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్‌కి రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్‌ బాండ్లు అందాయని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ట్రై పార్టీ అగ్రిమెంట్​కి ముందే ఎలక్ట్రోరల్ బాండ్స్ (Electoral Bonds) చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. రేసు నిర్వహణ కోసం గవర్నర్ సంతకం లేకుండానే ఐఏఎస్ అధికారి అరవింద్‌ (IAS Officer Arvind) రెండు ఒప్పందాలపై సంతకం చేశారని చేశారని పేర్కొన్నారు. ఈ రేసు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని వెల్లడించారు.

KTR | గవర్నర్​ అనుమతి

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ అధికారులు (ACB Officers) కేటీఆర్​ పేరు చేర్చారు. ఇప్పటికే ఆయనను నాలుగు సార్లు విచారించారు. కేటీఆర్​ (KTR) ప్రాసిక్యూషన్​కు ఇటీవల గవర్నర్​ సైతం ఆమోదించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్​ నేతలను అరెస్ట్ చేస్తామని పలువురు మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ ఇంత వరకు ఒక్క కేసు ముందుకు సాగలేదు. కాళేశ్వరం అంశం సీబీఐకి చేరింది. ఫోన్​ ట్యాపింగ్​, ఫార్ములా ఈ కార్​ రేసు కేసుల్లో విచారణ ఏళ్లుగా సాగుతోంది. అయితే తాజాగా గవర్నర్​ ప్రాసిక్యూషన్​కు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్​ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.