HomeUncategorizedNon Vegetarians | ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే.. నాన్​వెజ్​ తినే రాష్ట్రాల్లో మనమే టాప్​

Non Vegetarians | ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే.. నాన్​వెజ్​ తినే రాష్ట్రాల్లో మనమే టాప్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Non Vegetarians | తెలంగాణ(Telangana)లో మాంసం తినేవారు అధిక సంఖ్యలో ఉంటారు. మంచైనా.. చెడైనా మన దగ్గర మాంసం ఉండాల్సిందే. బర్త్​ డే ఫంక్షన్ల నుంచి మొదలు పెడితే.. పెళ్లిళ్ల వరకు ముక్క లేకపోతే చాలా మంది ఒప్పుకోరు. అలాగే అశుభ కార్యాలయ్యాల్లో సైతం చికెన్​, మటన్​ వండుతారు. దీంతో దేశంలోనే మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్​(Telangana Top)లో నిలిచింది.

భారతదేశంలో మాంసాహారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చేపలు(Fish), మాంసం(Meat) తినడానికి ఇష్టపడే వారు అధిక సంఖ్యలో ఉంటారు. పండగ ఏదైనా నాన్​ వెజ్​తో చేసుకోవడం మ‌నం చూస్తున్నాం. అయితే, దేశంలో అత్యధికంగా మాంసం తినే రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ ఫస్ట్​ప్లేస్​లో ఉంది. ఏ రాష్ట్రంలో ఎంత శాతం మాంసాహారులు ఉన్నారో వెలువడిన సర్వే రిపోర్టు వివరాలు ఇలా ఉన్నాయి.


ఇండియాలో ఎక్కువగా నాన్‌వెజ్(Nonveg) తినే రాష్ట్రాలు చూస్తే:

  1. తెలంగాణ(Telangana)
    రాష్ట్రంలో దాదాపు 98.8 శాతం ప్రజలు మాంసాహారం తింటారు.
    ప్రధాన ఆహారం : మటన్ కర్రీ, కోడి కూరలు, చేపలు, నాటు కోడి, బిర్యానీ
    విశేషం: హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది!
  2. పశ్చిమ బెంగాల్ (West Bengal)
    శాతం: సుమారు 98.7శాతం మాంసం తింటారు.
    ప్రసిద్ధి: చేపలు, తందూరి చికెన్, మటన్ కశా
    విశేషం: “మాఛ్ భాత్”(Mach Bhat) అంటే చేపలతో అన్నం బెంగాలీలకు స్టేపుల్ ఫుడ్
  3. ఆంధ్రప్ర‌దేశ్ (AP)
    శాతం: సుమారు 98.25
    ప్రధానంగా: చేపల కూరలు, రాయలసీమ నాటు కోడి పులుసు, పెరుగు మాంసం
    విశేషం: నాన్‌వెజ్ తినే ఇంటెన్సిటీ చాలా ఎక్కువ.. వీకెండ్‌లో తప్పనిసరి కూర
  4. ఒడిశా
    శాతం: సుమారు 97.35
    ప్రధానంగా: చేపలు, పుట్టలు, కోడి మాంసం
    విశేషం: పూరీ & భువనేశ్వర్ ప్రాంతాల్లో నాన్‌వెజ్ విస్తృతంగా తింటుంటారు.
  5. కేరళ
    శాతం: సుమారు 97
    ప్రధానంగా: చేపల కర్రీలు, బీఫ్ ఫ్రై, చికెన్ స్టూ
    విశేషం: క్రిస్టియన్, ముస్లిం, మరియు హిందూ కుటుంబాలు మాంసాహారం మిక్స్‌గా తీసుకుంటాయి.
  6. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో మాంసాహారం( Non Vegetarian) తినే శాతం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో నాన్ వెజ్ త‌క్కువగా తింటారు. భారతదేశం మాంసాహార పరంగా కూడా విభిన్న సంస్కృతులను కలిగి ఉంది. దాదాపు 70శాతం భారతీయులు ఏదో ఒక రూపంలో నాన్‌వెజ్ తింటారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే దానివెనకున్న రుచులు, సంప్రదాయాలు, స్థలచరిత్రలే అసలైన ఆకర్షణ!