Homeజిల్లాలుకరీంనగర్Bandi Sanjay | హిందుత్వం వల్లే గెలిచాం.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay | హిందుత్వం వల్లే గెలిచాం.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

తన నోటి నుంచి హిందుత్వం అని రాకపోతే శ్వాస ఆగినట్టే అని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొస్తామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటి నుంచి హిందుత్వం అని రాకపోతే తన శ్వాస ఆగినట్టే అని అన్నారు. కరీంనగర్​ జిల్లా (Karimnagar District) హుజురాబాద్​లో ఆయన మాట్లాడారు.

హిందుత్వం వల్లే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 48 సీట్లు గెలిచామని బండి సంజయ్​ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటు వేయడం లేదన్నారు. 12శాతం ఉన్న ముస్లింలు ఒక్కటైతే తప్పు లేనప్పుడు.. 80 శాతం ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. హిందుత్వ వాదంతోనే గడగడపకు తిరుగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana)లో రామరాజ్యాన్ని తీసుకొస్తామన్నారు.

Bandi Sanjay | అమాయకులను రెచ్చగొడుతున్నారు

మావోయిస్టులు అడవుల్లో చనిపోతుంటే.. అర్బన్ నక్సల్స్ మాత్రం ఆస్తులు సంపాదిస్తున్నారని బండి సంజయ్​ (Bandi Sanjay) ఆరోపించారు. అమాయక దళిత, గిరిజనులను రెచ్చగొట్టి తుపాకీ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వీరు మాత్రం లాబియింగ్​ చేసుకొని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay | మావోయిజానికి వ్యతిరేకం

బీజేపీ (BJP) మావోయిజానికి వ్యతిరేకం అని బండి సంజయ్ అన్నారు. తుపాకీ గొట్టంతో ఏమి సాధించలేరని చెప్పారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లను సమర్థించిన వారు కూడా నేరస్తులే అన్నారు. దేశంలో మార్చిలోపు మావోయిజం లేకుండా చేస్తామన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఉద్యమాలు చేస్తామని చెప్పుకునే అర్బన్​ నక్సల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో పదవులు ఎందుకు పొందారని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ఎన్నో హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. వాటిపై నిలదీయకుండా పదవులు ఎలా తీసుకున్నారన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు.