అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో కేటీఆర్ (KTR) దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ (BRS party) తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Kammarpally | కాంగ్రెస్ అగ్రనేతలపై..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై (Chief Minister Revanth Reddy) కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నాయకులు అన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అడుగడుగునా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, మాజీ కోఆప్షన్ అజ్మత్ పాషా, యూత్ కాంగ్రెస్ నాయకులు వేములవాడ జగదీష్, నల్ల సాయికుమార్, ఎడ్ల దీపక్, సంపంగి నాగరాజ్, శివసారం నరేష్, పీర్ల అర్వింద్, నాగపూర్ ఉప సర్పంచ్ శశి, చంద్రకాంత్ రెడ్డి, అబ్దుల్ అజర్, గోవింద్ శేఖర్, ఉట్నూర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.