అక్షరటుడే, హైదరాబాద్: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,61,900కి చేరగా, కిలో వెండి రూ.2,95,100గా నమోదైంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా సుంకాలు మరియు వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత లేకపోవడం వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో భారత్‌లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుచూపడం వల్ల పసిడి ధరలు Gold Prices మరింత ఎగసిపడుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరల్లో మాత్రం అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, తాజాగా వెండి కూడా గణనీయంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,61,900గా నమోదైంది.
Feb 26 Gold Prices | బంగారంతో పాటు వెండి కూడా..
ఇది నిన్నటి ధరతో పోలిస్తే స్వల్ప పెరుగుదల. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,410 వద్ద కొనసాగుతోంది. నగరంలో వెండి ధర Silver Prices కూడా ఒక్కరోజులోనే రూ.5 వేల మేర పెరిగి ప్రస్తుతం కిలోకు రూ.2,95,100గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు ఇదే ట్రెండ్‌ను చూపిస్తున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,62,890 కాగా – 22 క్యారెట్ రూ.1,49,310గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ రూ.1,61,900 – 22 క్యారెట్ రూ.1,48,410గా కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ ధర రూ.1,62,050 – 22 క్యారెట్ రూ.1,48,560గా ఉంది.
కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలలో 24 క్యారెట్ ధర రూ.1,61,900 కాగా – 22 క్యారెట్ రూ.1,48,410గా ఉంది.
వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ ధర రూ.1,61,950 – 22 క్యారెట్ రూ.1,48,460గా నమోదైంది.
ఇక వెండి ధరలు కూడా నగరాలవారీగా మార్పులు చూపిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి రూ.2,95,100గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో రూ.2,84,900గా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ Dollar మారకం విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సమీప భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ కొనసాగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ కొనుగోళ్లు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
