Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో జరగనుంది. తెలుగు, కొడవ సంప్రదాయాల్లో జరుగ‌నున్న‌ ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులకే ఆహ్వానం ఇచ్చారు. అతిథులందరికీ ‘నో మొబైల్’ పాలసీ అమలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన జంట విజయ్ దేవరకొండ Vijay Devarakonda , రష్మిక మందన్నా. వారి పెళ్లి బాజాలు నేడు మోగనున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో జరుగుతున్న […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో జరగనుంది. తెలుగు, కొడవ సంప్రదాయాల్లో జరుగ‌నున్న‌ ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులకే ఆహ్వానం ఇచ్చారు. అతిథులందరికీ ‘నో మొబైల్’ పాలసీ అమలు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన జంట విజయ్ దేవరకొండ Vijay Devarakonda , రష్మిక మందన్నా. వారి పెళ్లి బాజాలు నేడు మోగనున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫిబ్రవరి 26 గురువారం ఉదయం 10.10 గంటలకు శుభ ముహూర్తం నిశ్చయించారని సమాచారం. ఉదయం 8 గంటలకు పెళ్లి అన్న ప్రచారం ఉన్నప్పటికీ, అధికారిక సమాచారం ప్రకారం 10.10 గంటలకే వివాహం జరుగనుంది. బుధవారం హల్దీ కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించినట్లు తెలుస్తోంది.

Virosh Wedding Celebrations | తెలుగు – కొడవ సంప్రదాయాల కలయిక

విజయ్ దేవరకొండ తెలంగాణకు Telangana చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చినవారు. రష్మిక మందన్నా కర్ణాటకలోని కొడగు జిల్లా చెందిన కొడవ హిందూ కుటుంబానికి చెందారు. రెండు కుటుంబాల ఆచారాలను గౌరవిస్తూ తెలుగు, కొడవ సంప్రదాయాల్లో వివాహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్‌తో పాటు కళ్యాణీ ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్, ఈషా రెబ్బా, నిర్మాత & స్టైలిష్ట్ శ్రావ్య వర్మ తదితరులు ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు సమాచారం. అయితే, మార్చి 4న హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నారు.

ఈ వెడ్డింగ్‌లో Wedding ప్రత్యేకంగా అమలు చేస్తున్న నియమం ‘నో మొబైల్ పాలసీ’. పెళ్లి వేదికలోకి ప్రవేశించే ముందు అతిథుల మొబైల్ ఫోన్లు సేకరించి, ట్యాగ్ ఇచ్చి భద్రపరుస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తోంది. సంప్రదాయబద్ధత, ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ విజయ్–రష్మికల వివాహం టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిచే ఈవెంట్‌గా మారింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...