అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (State Government) విద్యా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆర్మూర్ పీడీఎస్‌యూ (Armoor PDSU), సీపీఎంఎల్ మాస్‌లైన్ ప్రజాప్రంథా నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో శుక్రవారం జరుగనున్న ఉమ్మడి జిల్లాల పీడీఎస్‌యూ మహాసభలకు ఆర్మూర్ నుంచి నాయకులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సీపీఎంఎల్ మాస్‌లైన్ ప్రజాప్రంథా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, ఏరియా అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను ఎండగడుతూ విద్యార్థులను చైతన్యం చేసేవిధంగా మహాసభలు ఉపయోగపడతాయన్నారు.
ఈ మహాసభలకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రి, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి ప్రభాకర్, సహాయ కార్యదర్శి రామకృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పృథ్వీ, అనిల్ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, సహాయ కార్యదర్శి సిద్ధార్థ, కోశాధికారి నిహారిక, నాయకులు రోజా, వివేక్, వెంకట్, వినయ్, అజయ్, ప్రవీణ్, భాను, విద్యార్థులు పాల్గొన్నారు.