అక్షరటుడే, ఇందూరు: CM Cup | క్రీడారంగంలో జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (Mla Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల (Polytechnic College) మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (Mla Dhanpal) సూర్యనారాయణ గుప్తాతో కలిసి శుక్రవారం టార్చ్ రిలేను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రధానంగా క్రమశిక్షణ, అలవడుతుందన్నారు. విద్యార్థులు దురలవాట్లకు బానిసలు కాకుండా క్రీడల వైపు ఆసక్తి చూపాలన్నారు.
CM Cup | జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి..
కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మాట్లాడుతూ జిల్లా నుంచి నిఖత్ జరీన్, యెండల సౌందర్య, సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేకమంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుండడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్(Cricketer Mohammed Siraj) జీవితమే ఎందుకు నిదర్శనమన్నారు.
CM Cup | నేనూ స్విమ్మర్నే..
తాను కూడా క్రీడాకారిణినేనని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. స్విమ్మింగ్లో అనేక విభాగాల్లో పాల్గొని పథకాలు సాధించాలని గుర్తు చేసుకున్నారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.