అక్షరటుడే, వెబ్డెస్క్ : AP CM Chandrababu | రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మిస్తే తాము అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సహకారంతో రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు.
మంత్రులు, అధికారులతో చంద్రబాబు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాస్ పుస్తకాల పంపిణీ, రిజిస్ట్రేషన్ సేవలు, పీపీపీ విధానంపై రివ్యూ చేశారు. 2026-27 బడ్జెట్ పైనా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్లు తెస్తామన్నారు.
AP CM Chandrababu | పోలవరం పూర్తయితే..
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) 67 శాతం పూర్తయిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. మనమే ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ఆయన ప్రశంసించారు. భూ సేకరణకు రైతులు ముందుకు వచ్చారని చెప్పారు. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేశామన్నారు. కేంద్రం సహకారంతో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.