అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally | కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని (Kammarpalli panchayat office) ఎస్సీ, బీసీ కాలనీ వాసులు సోమవారం ముట్టడించారు. ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి నీటి సమస్యతో (water problems) ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఎంపీడీవో రాజ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ భగీరథ ఏఈని పిలిపించి నీటి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీ హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
