అక్షరటుడే, వెబ్‌డెస్క్: VB–G RAM G ACT | వీబీ జీ రామ్ జీ చట్టంపై బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachander Rao) అన్నారు.
కేంద్రం ఇటీవల మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టం (VB–G RAM G ACT) తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు చట్టంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వర్క్‌షాప్ నిర్వహించారు.
VB–G RAM G ACT | కొత్త దిశను చూపుతుంది
రామచందర్‌రావు మాట్లాడుతూ.. పాత ఉపాధి పథకంలోని లోపాలు, లీకేజీలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టాన్ని తెచ్చారన్నారు. సాంకేతికత ఆధారంగా రూపొందిన ఈ చట్టం పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణకు కొత్త దిశ చూపుతుందని స్పష్టం చేశాను. బీజేపీ పథకాలను (BJP schemes) వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందన్నారు. 125 రోజుల ఉపాధి, 60:40 నిధుల మోడల్, గ్రామసభ ఆధారిత ప్రణాళికలు, బయోమెట్రిక్–GPS–AI పర్యవేక్షణతో కూడిన VB–G RAM G దేశానికి అత్యంత అవసరమైన సంస్కరణ అని పేర్కొన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యం అయితే బాధ్యత పెరుగుతుందన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన బీజేపీ నాయకులకు సూచించారు.