అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vastu tips : హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉంది. దేవతా స్వరూపంగా భావించే ఈ చెట్టును అందరూ భక్తితో పూజిస్తారు. అయితే, పూజల వరకు పవిత్రమైనదే అయినప్పటికీ.. అదే రావి చెట్టు ఇంటి గోడలపై, పైకప్పుపై పెరగడం వాస్తు పరంగా తీవ్రమైన దోషంగా పరిగణిస్తారు. దీనివల్ల కలిగే ఇబ్బందులు, పరిష్కారాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇంటి గోడలపై రావి చెట్టు: శాస్త్రాల ప్రకారం రావి చెట్టును పూజించడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి. కానీ వాస్తు శాస్త్రం Vastu Shastra మాత్రం ఈ చెట్టు నివాస గృహాల గోడలపై పెరగడాన్ని ఏమాత్రం అంగీకరించదు. ఇలా పెరగడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి (Negative Energy) పెరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Vastu tips : ప్రధాన సమస్యలు:
ఆర్థిక ఇబ్బందులు: ఇంటి పైకప్పు, గోడల మధ్య రావి చెట్టు పెరగడం వల్ల సంపదకు ఆటంకం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇంట్లో నివసించడం వల్ల పనులు ఆగిపోవడం, ఆకస్మిక అడ్డంకులు ఎదురుకావడం వంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతాయట. ఇంటి సభ్యులపై ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Vastu tips : వాస్తు దోషం ఎప్పుడు తీవ్రమవుతుంది?
ఒక ఇంటిపై ఒకటి కంటే ఎక్కువ రావి మొక్కలు పెరగడం పెద్ద వాస్తు దోషంగా మారుతుంది. ఇది ఇంట్లోని ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కేవలం సొంత ఇల్లే కాదు, ఇలాంటి దోషాలు ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవడం కూడా శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
పరిష్కారం :
ఒకవేళ మీ ఇంటి గోడలపై రావి చెట్టు peepal tree పెరిగి, అదే ఇంట్లో ఉండాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
రావి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి, దానిని నేరుగా పీకేయకుండా ముందుగా ఒక పూజారిని సంప్రదించాలి. శాస్త్రోక్తంగా పూజలు చేయించి, ఆ మొక్కను సురక్షితంగా తీసి ఏదైనా ఖాళీ ప్రదేశంలో, గుడి సమీపంలో నాటాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటిపై ఉండే వాస్తు దోష ప్రభావం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
భక్తి వేరు, వాస్తు వేరు. భక్తితో రావి చెట్టును పూజించండి, కానీ ఇంటి గోడలు దాని వల్ల దెబ్బతినకుండా, వాస్తు దోషాలు కలగకుండా జాగ్రత్త పడండి.