అక్షరటుడే, ఇందూరు: BC Welfare Department | స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని పలువరు వక్తలు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఓబన్న జయంతి (Obanna birth anniversary) నిర్వహించారు.
BC Welfare Department | బ్రిటిష్ పాలనలో..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను ఎదిరించిన యోధుడు ఓబన్న అన్నారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఆయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన పోరులో సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్టిఏ సభ్యుడు నరేందర్ గౌడ్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, నరాల సుధాకర్, వెంకటేష్, రాము, శంకర్ తదితరులు పాల్గొన్నారు.