Urvashi Rautela | అయ్య‌య్యో.. అలా ఎలా.. ఆ మ్యాచ్‌కి వెళ్లి ఏకంగా రూ.70 ల‌క్ష‌లు పోగొట్టుకున్న హీరోయిన్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urvashi Rautela | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా కు లండన్‌లో ఊహించ‌ని షాక్ తగిలింది. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు హాజరవ్వడానికి లండన్‌కి వెళ్లిన ఆమెకు గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌(Gatwick Airport)లో అనుకోని స‌మ‌స్య ఎదురైంది. ఆమెకు అత్యంత ప్రియమైన డియోర్ బ్రౌన్ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌(Dior Brown Luxury Handbag)ను ఎవరో అపహరించారని తెలుస్తోంది. ఆ బ్యాగులో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి వెల్లడించారు. ముంబై నుంచి లండన్ చేరుకున్న […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urvashi Rautela | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా కు లండన్‌లో ఊహించ‌ని షాక్ తగిలింది. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు హాజరవ్వడానికి లండన్‌కి వెళ్లిన ఆమెకు గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌(Gatwick Airport)లో అనుకోని స‌మ‌స్య ఎదురైంది. ఆమెకు అత్యంత ప్రియమైన డియోర్ బ్రౌన్ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌(Dior Brown Luxury Handbag)ను ఎవరో అపహరించారని తెలుస్తోంది. ఆ బ్యాగులో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి వెల్లడించారు. ముంబై నుంచి లండన్ చేరుకున్న ఊర్వశి, గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కొద్ది సమయంలోనే తన బ్యాగ్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది(Airport Staff)ని సంప్రదించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Urvashi Rautela | అంత అజాగ్ర‌త్త‌నా..

ఊర్వశి తన బ్యాగ్​ పోయిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్​ చేసింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు, తన అభిమానులు సాయం చేయాలని కోరింది. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. “డియోర్ బ్రౌన్ బ్యాగ్ పోగొట్టుకున్న మొదటి హీరోయిన్ మీరే” అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా, మరికొంతమంది ఆమెను ఓదార్చుతూ “మీ బ్యాగ్ త్వరలోనే దొరుకుతుంది, ధైర్యంగా ఉండండి” అని అన్నారు. గతంలో కూడా ఊర్వ‌శి ప‌లు వ‌స్తువులు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా చెవిపోగు పోగొట్టుకున్నారని వార్తలు వచ్చాయి.

అలానే ఓ సారి తన ఐఫోన్ (I Phone) కూడా చోరీకి గురైందని ఊర్వ‌శి రౌతేలా(Urvashi Rautela) పేర్కొన్నారు. ఇక ఊర్వశి రౌతేలా చివ‌రిగా సన్నీ డియోల్‌తో కలిసి నటించిన జాట్ చిత్రంలో కనిపించారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణతో కలిసి డాకూ మహరాజ్ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీలో అయితే వెల్‌కమ్ టు ది జంగల్, కసూర్ 2 వంటి ప్రాజెక్టుల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.