అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea : తెలంగాణ(Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కర్షకులకు ఎరువుల తిప్పలు తప్పేలా కనబడడం లేదు. పంట సాగు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడబోతోంది. ఎందుకంటే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ Peddapalli fertilizer factory తాత్కాలికంగా మూతబడింది.
Urea : కారణం అదే..
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (Ramagundam Fertilizers and Chemicals Limited – RFCL) ప్లాంట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా యూరియా ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఈ పరిశ్రమలో ఆమోనియా సరఫరా అయ్యే ఎల్బో పైపులలో లీకేజీ ఏర్పడింది. ఫలితంగా ఫ్యాక్టరీని పక్షం రోజులపాటు మూసివేయాలని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
Urea : సుమారు 50 వేల మెట్రిక్ టన్నులు..
ప్లాంట్లో ఏర్పడిన పైపుల లీకేజీని సరిచేసేందుకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశ్రమను 15 రోజులపాటు మూసివేయనున్నారు. ఇలా మూసివేయడం వల్ల దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ప్రొడక్షన్ ఆగిపోనుంది. దీని ప్రభావం ఉభయ రాష్ట్రాల రైతులపై భారీగానే పడనుంది.
Urea : ఇప్పటికే లోటు..
తెలంగాణ రాష్ట్రానికి నెలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ, జులైలో కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించడం గమనార్హం. తాజాగా రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతో రైతులకు మరింత ప్రభావం ఉండబోతోంది.