అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pak Army Chief | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు (Pak Army Chief Asim Munir) అపరిమిత అధికారాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు విస్తృత అధికారులు కల్పించడానికి అవసరమయ్యే రాజ్యాంగ సవరణకు అక్కడి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కాగా.. ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసింది.
Pak Army Chief | మూడింట రెండొంతుల మెజారిటీతో..
పాకిస్థాన్ పార్లమెంటు (Pakistan parliament) దిగువ సభ మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదం తెలిపింది. కేవలం నలుగురు శాసనసభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా.. ఎగువ సభలో రెండు రోజుల క్రితమే బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి సంతకం అనంతరం ఇది చట్టంగా మారనుంది.
కొత్త చట్టం అమలులోకి వచ్చాక ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆసిం మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా (Chief of Defense Forces) బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆయనకు జీవితకాలం రక్షణ లభిస్తుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం లభించిన అనంతరం ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Prime Minister Shehbaz Sharif) మాట్లాడారు. వైమానిక, నావికాదళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
