అక్షరటుడే, బాన్సువాడ: Sri Chaitanya School | పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాలను మండల విద్యాధికారి నాగేశ్వరరావు (MEO Nageshwar Rao) సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు (DEO Raju) సూచనల మేరకు విద్యాశాఖ (Education department) అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మూసివేసినట్లు తెలిపారు. తదుపరి అనుమతులు వచ్చే వరకు పాఠశాలలో తరగతులు నిర్వహించవద్దని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.
Sri Chaitanya School | అనుమతి లేని పాఠశాలల్లో చేర్పించవద్దు..
విద్యాశాఖ అనుమతులు వచ్చేవరకు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించవద్దని సూచించారు. అనుమతి లేని పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరించారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలల అనుమతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.