Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal mandal | కట్టుకున్నోడినే కడతేర్చారు.. భర్తపై డీజిల్ పోసి చంపిన ఇద్దరు భార్యలు

Bheemgal mandal | కట్టుకున్నోడినే కడతేర్చారు.. భర్తపై డీజిల్ పోసి చంపిన ఇద్దరు భార్యలు

కుటుంబ కలహాలతో కట్టుకున్నోడిని కడతేర్చిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్​: Bheemgal mandal | కుటుంబ కలహాలతో కట్టుకున్నోడిని కడతేర్చిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట గ్రామంలో (Devakkapet village) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేవక్కపేట్ గ్రామానికి చెందిన మాలవత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు.

అయితే వీరు తరచూ ఇంట్లో గొడవ పడుతూ ఉండేవారు. కాగా.. మోహన్‌ సోమవారం ఉదయం మద్యం సేవించి ఇంటికి వచ్చి కుర్చీపై నిద్రపోతున్నాడు. ఇదే అదనుగా భావించిన తన ఇద్దరు భార్యలు అతడిపై పెట్రోల్​ పోసి పక్కనే ఉన్న పొయ్యిలోంచి నిప్పు తీసి అంటించారు. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్‌కు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి అన్న రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ (Sub-Inspector Sandeep) తెలిపారు.