అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | సోషల్ మీడియా (Social Media)లో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో అంచనా వేయలేరు. ఏ వీడియో ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతుందో, ఏ పోస్ట్ ఎందుకు పాపులర్ అవుతుందో చెప్పడం కష్టం. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కొన్నిసార్లు వ్యూస్‌కి నోచుకోకుండానే మాయమైపోతాయి.
మరోవైపు, ఒక్క చిన్న క్లిప్ దేశం దృష్టిని ఆకర్షిస్తుంటుంది.. అలాంటి ఉదాహరణే ఇప్పుడు ప్రియాంగ అనే యువతి ఆటోలో కూర్చుని తీసుకున్న… కేవలం రెండు సెకన్ల వీడియో. ఈ చిన్న క్లిప్ ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 10 కోట్లకుపైగా వ్యూస్ సాధించి దేశం మొత్తం మాట్లాడుకునే టాపిక్ గా మారింది.
Viral Video | రెండు సెకన్ల వీడియో కానీ..
నవంబర్ 2న ‘bud wiser @w0rdgenerator’ అనే ఎక్స్ ఖాతా నుండి ఈ వీడియో పోస్ట్ చేయబడింది.
“Makeup ate today” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన క్లిప్‌లో ప్రియాంగ వైట్ టాప్, వెండి చెవిపోగులతో ఆటోలో కూర్చొని కెమెరాకు చిరునవ్వు ఇచ్చింది. అంతే… రెండు సెకన్ల వీడియో 10 కోట్ల వ్యూస్, 26 వేల రీపోస్టులు, ఆరు వేలకిపైగా కామెంట్లు, 1.25 లక్షల లైక్స్ రాబట్టింది. ఇంకా ఈ సంఖ్యలు పెరుగుతూనే ఉన్నాయి. వీడియో వైరల్ (Viral Video) అయ్యాక ఆమె ఎవరో తెలుసుకోవడానికి మీడియా ఇంటర్నెట్ అంతా వెతికింది. చివరికి వెలుగులోకి వచ్చిన పేరు ప్రియాంగ. సోషల్ మీడియాలో పెద్దగా పాపులర్ కాకపోయినా, ఒక్క క్లిప్ వల్లే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ప్రియాంగ స్పందిస్తూ.. “మహా అయితే వెయ్యి లైకులు వస్తాయని అనుకున్నా… ఇది నా కంట్రోల్‌లో లేదు. నా ముఖమే పదేపదే కనిపిస్తుండటంతో నేనే అలసిపోయాను! అని పేర్కొంది. అయితే వీడియోలో ఎలాంటి ప్రత్యేక రియాక్షన్ లేదు. ప్రత్యేక ఎఫెక్ట్స్ (Special Effects) లేవు. కేవలం ఒక లుక్ మాత్రమే. అయినా వైరల్ అయింది. ఇదే నెటిజన్లకు మిస్టరీ. ఈ రెండు సెకన్ల క్లిప్ ఇప్పుడు మీమ్ టెంప్లేట్ గా మారింది. కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు బ్యాక్‌డ్రాప్‌లా వాడుకుంటున్నారు. ఈ ప్రాచుర్యం వల్ల ప్రియాంగ అకౌంట్ క్రమంగా మామూలు యూజర్ నుంచి వెరిఫైడ్ యూజర్‌గా మారిపోయింది. ‘bud wiser’ ఖాతాకు ఇప్పుడు బ్లూటిక్ కూడా వచ్చింది.దానిపై కూడ నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి .
