అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK Chief Vijay | తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ (TVK party chief Vijay) నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయన చెన్నై నుంచి ఢిల్లీ బయలు దేరారు.
కరూర్ తొక్కిఘటనపై విచారణకు హాజరుకావాలని విజయ్‌కు ఆరు రోజుల క్రితం సీబీఐ సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్ ర్యాలీలో 41మంది ప్రాణాలు కోల్పోవడంపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును (CBI investigation) పర్యవేక్షించేందుకు ముగ్గరు సభ్యుల కమిటీని న్యాయస్థానం నియమించింది. సోమవారం సాయంత్రం ఆయనను అధికారులు విచారించనున్నారు.
TVK Chief Vijay | 41 మంది మృతి
తమిళనాడులోని (Tamil Nadu) కరూర్ జిల్లాలో తొక్కిసలాటలో 41 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట దర్యాప్తుకు సంబంధించి జనవరి 6న సీబీఐ విజయ్‌కు సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణకు సంబంధించి టీవీకే కార్యనిర్వాహకులను ప్రశ్నించింది. కాగా సెప్టెంబర్ 27న ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని తమిళనాడు పోలీసులు తెలిపారు. పది వేల మంది వస్తారని అనుమతి తీసుకొగా.. మూడు రెట్లు ఎక్కువగా వచ్చారన్నారు. నిర్వాహకుల తీరుతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కూడా టీవీకేపై తీవ్రంగా మండిపడింది, ఈ ఘటనను మానవ తప్పిదంతో జరిగిన ఒక పెద్ద విపత్తు అని పేర్కొంది.