Homeఅంతర్జాతీయంDonald Trump | జెలెన్‌స్కీకి ట్రంప్​ షాక్​.. రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికకు ఆమోదం

Donald Trump | జెలెన్‌స్కీకి ట్రంప్​ షాక్​.. రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికకు ఆమోదం

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ముగింపు కోసం 28 పాయింట్ల శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం రష్యాకు అనుకూలంగా ఉండటం గమనార్హం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఉక్రెయిన్​కు షాక్​ ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో 28 అంశాల ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. అయితే ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్​ (Russian President Putin)కు అనుకూలంగా ఉండటం గమనార్హం. దీనిపై ఎలాంటి హడావుడి లేకుండా ట్రంప్​ రహస్యంగా ఆమోదం తెలిపారు.

ట్రంప్ బృందంలోని సీనియర్ సభ్యులు కొన్ని వారాలుగా శాంతి ఒప్పందం కోసం పని చేస్తున్నారు. రష్యా రాయబారి కిరిల్ డిమిత్రివ్‌ (Russian Ambassador Kirill Dmitriev)తో పాటు ఉక్రెనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ ట్రంప్ మునుపటి 20-పాయింట్ల గాజా ప్రణాళిక వెనుక ఉన్న విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఈ ప్రతిపాదనను రూపొందించే చొరవకు నాయకత్వం వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని సాధించడం, భద్రతా హామీలను అందించడం, యూరప్‌లో స్థిరత్వాన్ని నిర్ధారించడం, రష్యా– ఉక్రెయిన్ రెండింటితో భవిష్యత్ US సంబంధాలను వివరించడం వంటి అంశాలతో శాంతి ఒప్పందం ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

Donald Trump | రష్యాకు అనుకూలంగా..

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia–Ukraine War) మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్​ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 28 పాయింట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఇందులోని కొన్ని నిబంధలను గతంలోనే ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యతిరేకించారు. అయినా కూడా ట్రంప్​ ట్రంప్ మాత్రం దానికి ఆమోదం తెలిపారని సమాచారం.

Donald Trump | ప్రణాళికలో ఏముందంటే?

ట్రంప్​ (Donald Trump) ఆమోదించిన శాంతి ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్‌ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్​ సైనిక బలాన్ని తగ్గించుకోవాలి. ఆ దేశ రక్షణకు అమెరికా సైనిక సహాయాన్ని ఆపేయాలి. ఆ దేశంలో విదేశీ బలగాలకు అనుమతి ఇవ్వొద్దు. రష్యాపై దాడి చేయగలిగే ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు. కాగా నాటోలో చేరడానికి జెలెన్​స్కీ యత్నించడంతో రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, నాటో దేశాలు ఆ దేశానికి మద్దుతుగా నిలిచాయి. ఈ క్రమంలో తాజా ప్లాన్​ ఉక్రెయిన్​కు ఇతర దేశాలు అండగా ఉండటానికి వీలు లేదని రష్యా స్పష్టం చేసింది. దానికి ట్రంప్​ ఆమోదం తెలపడం గమనార్హం. దీనిపై రష్యా, ఉక్రెయిన్​ ఎలా స్పందిస్తాయో చూడాలి.