అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranti Festival | సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ (Hyderabad)లో నివాసం ఉంటున్న వారు స్వగ్రామాలకు పయనం అయ్యారు. దీంతో హైవేలపై వాహనాల రద్దీ నెలకొంది.
రాష్ట్రంలో శనివారం (నేటి) నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే ప్రజలు ఊళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీంతో హైదరాబాద్‌లోని ఏపీవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఫలితంగా ఆ రాష్ట్రానికి వెళ్లే హైవేలపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Sankranti Festival | పంతంగి టోల్‌ప్లాజా వద్ద..
చౌటుప్పల్ మండలం (Choutuppal Mandal) పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కిలోమీటర్ల మేర బారులు తీరి వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. సెలవులు ప్రారంభం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Sankranti Festival | కిటకిటలాడుతున్న బస్టాండ్లు
హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations) కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారితో రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్లో ప్రయాణికుల సందడి నెలకొంది. ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణాలోని జిల్లాలకు స్పెషల్ బస్సులు వేశారు. వీటిలో 50శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.