Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | ప్రజల కోసం పని చేయాలి

Kamareddy SP | ప్రజల కోసం పని చేయాలి

ప్రజల కోసం పోలీసు సిబ్బంది పని చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్​ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీసు సిబ్బంది ప్రజల కోసం పని చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్​ను (Devunipalli Police Station) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్దులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీం, ఎస్​హెచ్​వో, మెన్ రెస్ట్ రూం, లాక్ అప్ రూం, స్టేషన్ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విస్తృతంగా డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు (Drunk driving checks) చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), రూరల్ సీఐ రామన్, ఎస్సై రంజిత్, సిబ్బంది ఉన్నారు.

Kamareddy SP | పొగమంచులో ప్రయాణాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ రాజేష్ చంద్ర

పొగమంచులో (fog) రాత్రిపూట ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు. రోడ్లపై పొగమంచు కారణంగా వాహనదారులు, పాదచారులు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

వాహనాలను నిదానంగా, శ్రద్ధగా నడపాలని సూచించారు. హెడ్‌లైట్లు లోబీమ్‌లో ఉంచి, పరిస్థితులకు అనుగుణంగా ఫాగ్ లైట్లను ఉపయోగించాలన్నారు. తక్కువ వీక్షణ కారణంగా ఆకస్మికంగా ఓవర్‌టేక్ (sudden overtaking) చేయడం ప్రమాదకరమని చెప్పారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.