అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు Gold Prices క్రమేపి తగ్గుతుండటం మనం గమనించవచ్చు. నవంబర్ 24న (సోమవారం) బంగారం, వెండి ధరల్లో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి. ముఖ్యంగా పసిడి ధర భారీగా తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించింది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,340కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.94,370గా ఉంది.
వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.1,71,900 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే పసిడి ధర గణనీయంగా తగ్గింది.
Today Gold Prices | తగ్గుదల..
గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ Dollar బలపడటం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ధరలు మారుతూ ఉన్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,26,887, 22 క్యారెట్ల ధర రూ.1,16,290గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900గా నమోదైంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,830, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,340, వెండి కిలో ధర రూ.1,63,900గా ఉంది.
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.1,25,980, 22 క్యారెట్ల పసిడి రూ.1,15,490, వెండి కిలో ధర రూ.1,63,900గా ఉంది.
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా ధరలు సుమారు ఒకేలా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,25,830, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,340, వెండి ధర కిలోకు రూ.1,71,900గా ఉంది.
అయితే, ప్రతి నగరంలో బంగారం, వెండి ధరలు ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మార్కెట్‌లో ధరలు ప్రతి గంటకి మారే అవకాశమున్నందున, బంగారం కొనుగోలు చేసే ముందు తాజా లైవ్ రేట్లను పరిశీలించడం మంచిది.
