Homeతాజావార్తలుToday Gold Prices | మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి...

Today Gold Prices | మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. బంగారం కొనాల‌ని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ధ‌రలు ఆకాశాన్ని అంటుతుండ‌టంతో కాస్త వెనుక‌డుగు వేయాల్సి వ‌స్తోంది. అయితే ఈ రోజు ధ‌ర‌ల‌లో స్వ‌ల్ప‌ తగ్గుదల క‌నిపించింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గ‌త వారం రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో Gold Rates హెచ్చుత‌గ్గులు గ‌మ‌నిస్తూ ఉన్నాం. గురువారం స్వల్పంగా పెరిగినా, శుక్రవారం (నవంబర్ 21) మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,260 గా నమోదైంది.

ఇది నిన్నటి ధర అయిన రూ.1,24,860తో పోలిస్తే రూ.600 తక్కువ. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 తగ్గి 10 గ్రాములకు రూ.1,13,900 వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,24,410 కాగా, 22 క్యారెట్ ధర రూ.1,14,050గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధరలు రూ.1,24,260గా ఉన్నాయి.

Today Gold Prices | భారీ త‌గ్గుద‌ల‌..

చెన్నైలో Chennai మాత్రమే ధరలు మరికాస్త ఎక్కువగా ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,25,460, 22 క్యారెట్ రూ.1,15,000 గా నమోదయ్యాయి.

ఇక వెండి ధరలు కూడా గురువారంతో పోల్చితే భారీగా తగ్గాయి. కిలోకు వెండి ధర రూ.3,000 తగ్గి ముఖ్య నగరాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళల్లో వెండి ధర కిలోకు రూ.1,73,000గా ఉండగా, ఢిల్లీ, వడోదర, ముంబై, కోల్‌కతా ప్రాంతాల్లో ధరలు రూ.1,64,900 – రూ.1,65,000 మధ్య ఉన్నాయి.

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల క‌నిపించ‌డంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ శుక్రవారం అనుకూలంగా మారింది. కొనుగోలు సీజన్ దృష్ట్యా ఈ తగ్గుదల మార్కెట్‌ను మరింత కదిలించే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.

బంగారం లేదా వెండిలో Silver Prices పెట్టుబడి పెట్టడం ఎప్పటి నుంచో అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. ప్రత్యేకించి భారతదేశంలో బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య మరింత ఎక్కువ.

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు భారీగా మొగ్గు చూపడంతో, రేట్లు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడం కంటే, ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం మరింత సౌకర్యవంతంగా మారింది.