Homeతాజావార్తలుToday Gold Prices | గోల్డ్​ మరింత ప్రియం.. రానున్న రోజుల‌లో ధర మ‌రింత పెరిగే...

Today Gold Prices | గోల్డ్​ మరింత ప్రియం.. రానున్న రోజుల‌లో ధర మ‌రింత పెరిగే ఛాన్స్!

Today Gold Prices | కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు పెరుగుద‌ల బాట ప‌ట్టే ఛాన్స్ క‌నిపిస్తోంది. బంగారం పెరుగుతూ సామాన్యుల‌ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గత రెండు రోజులుగా త‌గ్గుతూ వచ్చిన బంగారం ధరలు Gold Prices ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రభావం భారతీయ బంగారం మార్కెట్‌పై కూడా స్ప‌ష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం స్థిరీకరణ దశలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, నవంబర్ 20న దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ పసిడి పది గ్రాముల ధర రూ. 1,24,870కి చేరుకుంది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,14,460గా నమోదైంది.

Today Gold Prices | కాస్త పైకి..

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,25,020గా ఉండగా, 22 క్యారెట్ బంగారం రూ. 1,14,610కు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారెట్ ధర రూ. 1,24,870గా కొనసాగగా, 22 క్యారెట్ ధర రూ. 1,14,460గా నమోదు అయ్యింది.

వడోదరలో మాత్రం 24 క్యారెట్ ధర రూ. 1,24,920 కాగా , 22 క్యారెట్ ధర రూ. 1,14,510గా ట్రెండ్ అయింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,76,100గా నమోదయ్యింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో వెండి ధర కిలోకు రూ. 1,68,100గా ఉంది.

మొత్తం మీద దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు Silver Prices స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ఊగిసలాట, డాలర్ బలం, గ్లోబల్ జియోపాలిటికల్ పరిస్థితులు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపుతున్నాయి.

పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.