Giriraj College | పరిశోధన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Giriraj College | విద్యార్థులు పరిశోధన అంశాలపై అవగాహన పెంపొందించుకుంటే ఉన్నత విద్యలో ఎంతో ఉపయోగపడుతుందని గిరిరాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ‘విద్యా రచనలు, ప్రాజెక్టు నివేదికలు’ (Academic writings, project reports) అనే అంశంపై గురువారం కళాశాలలో ఒకరోజు కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కేవలం అవగాహన కల్పించుకోవడమే కాకుండా మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ జాన్ సుకుమార్ పరిశోధనా పద్ధతులపై పవర్ […]

అక్షరటుడే, ఇందూరు: Giriraj College | విద్యార్థులు పరిశోధన అంశాలపై అవగాహన పెంపొందించుకుంటే ఉన్నత విద్యలో ఎంతో ఉపయోగపడుతుందని గిరిరాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ‘విద్యా రచనలు, ప్రాజెక్టు నివేదికలు’ (Academic writings, project reports) అనే అంశంపై గురువారం కళాశాలలో ఒకరోజు కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కేవలం అవగాహన కల్పించుకోవడమే కాకుండా మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ జాన్ సుకుమార్ పరిశోధనా పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ఇచ్చారు. ఈ సందర్భంగా జాన్​ సుకుమార్​, శ్యాంకుమార్​ను కళాశాల తరపున సన్మానించారు.

కార్యక్రమంలో డాక్టర్ శ్యాం కుమార్, డాక్టర్ గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ దండు స్వామి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, ఎన్​సీసీ (NCC) అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, గ్రంథపాలకులు పూర్ణచంద్రరావు, సీనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు ప్రతిభ, నాగజ్యోతి, లావణ్య, రాజశేఖర్, దస్తప్ప, నికత్ ఫాతిమా, వసంత్ జాదవ్, స్థిత ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.