అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు.
బాల భరోసా పథకం (Bala Bharosa scheme), ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం సోమవారం ప్రారంభించారు. ప్రజాభవన్లో (Praja Bhavan) జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వారి వివాహానికి అందించే ప్రోత్సాహాన్ని రూ.రెండు లక్షలకు పెంచుతామన్నారు. దివ్యాంగులకు ఎవరైనా పెళ్లి చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్న గతంలో ప్రభుత్వం రూ.లక్ష నగదు అందజేసింది. తాజాగా దానిని రెట్టింపు చేస్తామని సీఎం ప్రకటించారు. విద్య, ఉద్యోగాల భర్తీలో (job recruitment) దివ్యాంగులకు కోటాను కేటాయిస్తున్నామన్నారు. వారికి భరోసా కల్పించేందుకు రూ. 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను సీఎం (CM Revanth Reddy) పంపిణీ చేశారు.
CM Revanth Reddy | తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత
ప్రభుత్వ ఉద్యోగులను సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. వారిని నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10-15 శాతం కోత విధిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకు వస్తామని తెలిపారు. కాగా ఎంతో కష్టపడి చదివిచించిన తల్లిదండ్రులను చాలా మంది కొలువు రాగానే పట్టించుకోవడం లేదు. అలాంటి వారి జీతాల్లో కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తామని గతంలో సీఎం చెప్పారు. ఇలాంటి బిల్లు తీసుకు వస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు అంటున్నారు. వృద్ధులను ఆదుకోవడానికి ప్రణామ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.