అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamannaah Bhatia | తెలుగు సినిమా పరిశ్రమ (Telugu Film Industry)లో కాలంతో సంబంధం లేకుండా క్రేజ్‌ను నిలబెట్టుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అలాంటి జాబితాలో త్రిష వంటి సీనియర్ స్టార్స్ ఉంటే, ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న మరో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.
ప్రధాన కథానాయికగా అవకాశాలు తగ్గినప్పటికీ, డిమాండ్ విషయంలో మాత్రం తమన్నా ఏమాత్రం తగ్గడం లేదు.‘శ్రీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా, ‘హ్యాపీ డేస్’తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలోనూ వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్‌తో పాటు నటనకూ ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Tamannaah Bhatia | లీడ్ రోల్స్ తగ్గినా… డిమాండ్ తగ్గలేదు
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న తమన్నాకు ఇప్పుడు ప్రధాన కథానాయిక పాత్రలు తగ్గాయి. అయితే దీనిని లోటుగా కాకుండా తన బలంగా మార్చుకుంది. స్పెషల్ సాంగ్స్ (Special Songs), ఐటెమ్ నంబర్లతో మరోసారి తన మార్కెట్‌ను పటిష్టం చేసుకుంది. తెలుగులో కంటే హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు ప్రస్తుతం డిమాండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ‘జైలర్’ సినిమా (Jailer Movie)లోని ‘కావాలయ్యా’ పాటతో తమన్నా మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత హిందీలో ‘ఆజ్ కీ రాత్’, తాజాగా ‘రైడ్ 2’ సినిమాలోని ‘నషా’ పాటతో సోషల్ మీడియా (Social Media)లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలు మిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, తమన్నా స్టేజ్ ప్రెజెన్స్, డ్యాన్స్ ఎనర్జీకి కొత్త ఫ్యాన్‌బేస్‌ను తెచ్చాయి.
ఇప్పటికే ‘రైడ్ 2’ లోని స్పెషల్ సాంగ్‌కు సుమారు రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న ఇండస్ట్రీ టాక్ ప్రకారం, గోవాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో కేవలం 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌కు తమన్నా దాదాపు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం లీడ్ హీరోయిన్‌గా సినిమాలు లేకపోయినా, తమన్నా పేరు మాత్రం మార్కెట్‌లో గట్టిగానే నడుస్తోంది. స్పెషల్ సాంగ్స్, స్టేజ్ షోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆమె సంపాదన టాప్ స్టార్స్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉందని అంటున్నారు. ఇదే కారణంగా “సినిమాలు తక్కువైనా… డిమాండ్ మాత్రం టాప్ గేర్‌లో” అంటూ ఫ్యాన్స్, సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.