Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | తాగిన వాళ్లతో వచ్చి అడ్డుకున్నారు : మంత్రి సీతక్క

Minister Seethakka | తాగిన వాళ్లతో వచ్చి అడ్డుకున్నారు : మంత్రి సీతక్క

బీఆర్​ఎస్​ గ్రామ అధ్యక్షుడు మరో ఇద్దరు తాగిన వ్యక్తులతో వచ్చి తన కాన్వాయిని అడ్డుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. దీనిపై బీఆర్​ఎస్​ వారు సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, మరో ఇద్దరు తాగిన వ్యక్తులతో వచ్చి తన కాన్వాయి అడ్డుకున్నారని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (District in-charge Minister Seethakka) తెలిపారు. రామారెడ్డిలో (Ramareddy) తన కాన్వాయి అడ్డుకోవడంపై మంత్రి స్పందించారు.

గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇద్దరు తాగిన వారితో వచ్చి కాన్వాయి అడ్డుకున్నారని, ఆ సమయంలో కాన్వాయి కింద పడి చనిపోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. దీనికి తాను సమాధానం చెప్తుంటే పారిపోయామని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో (BRS Social Media) రాసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎలా కేటీఆర్.. మీ వంది మాగదులకు బుద్ధి రాకుంటే ఎట్లా’’ అని ప్రశ్నించారు. నలుగురిని వేసుకుని వచ్చి రైతుల పోరాటం అంటారా అని నిలదీశారు.

రైతులకు తాము ఏమి అన్యాయం చేశామని, 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. ఇవాళ సన్న వరికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. మధ్యలో కొంతమందికి రాకపోవచ్చు అని పేర్కొన్నారు. తనను అడ్డుకున్న వారిలో ఒకరు రెండేళ్లుగా బోనస్ రావడం లేదంటున్నారని, అసలు తాము అధికారంలోకి వచ్చే ఇంకా రెండు సంవత్సరాలు కాలేదని విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలా తప్పుడు సమాచారంతో ముందుకు పోతే జూబ్లీహిల్స్ తీర్పు రిపీట్ అవుతుందన్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills)లో వందల మీడియా సంస్థలు, సోషల్ మీడియాను పెట్టుకున్నా అక్కడి ప్రజలు బీఆర్​ఎస్​ బుద్ధి చెప్పారని తెలిపారు. ఇవాళ అడ్డుకున్న వారికి అక్కడ భూములు లేవని, ఇలాంటి డ్రామాలు ఆపు రామారావు అని సూచించారు.