అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAEA | పాకిస్తాన్‌లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్(Radiation Leak) కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) స్పష్టం చేసింది. ఇటీవల భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన అణు వార్‌హెడ్లు దెబ్బ తిని రేడియేషన్ విడదలవుతోందని వచ్చిన వార్తలను తోసి పుచ్చింది. పాకిస్తాన్‌లోని ఏ అణు కేంద్రం నుండి రేడియేషన్ లీక్ లేదా విడుదల కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(International Atomic Energy Agency) ధ్రువీకరించింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ అణు కేంద్రాన్ని భారత దళాలు లక్ష్యంగా చేసుకుని బాంబుదాడులు చేశాయని సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఐఏఈఏ ప్రకనట ప్రాధాన్యం సంతరించుకుంది.
IAEA | ‘రేడియేషన్ లీక్ కాలేదు’
ఐఏఈఏ(IAEA)కి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పాకిస్తాన్‌లోని ఏ అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ లేదా విడుదల జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధి PTIకి తెలిపారు. సర్గోధా వైమానిక స్థావరంపై భారత దాడుల తర్వాత పాకిస్తాన్ అణు కేంద్రం కొంత నష్టాన్ని చవిచూసిందని, ఫలితంగా అక్కడి నుండి రేడియేషన్ లీకైందని మీడియా ఊహాగానాలతో నిండిపోయింది. కిరానా హిల్స్ సమీపంలో పొగ ఎగసిపడడం తాము చూశామని స్థానికులు కూడా పేర్కొన్నారు.
IAEA | మొన్ననే ఖండించిన భారత్..
కిరాణా హిల్స్(Kirana Hills)ను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను భారత్ ఇప్పటికే ఖండించింది. “కిరాణా హిల్స్‌లో కొన్ని అణు కేంద్రాలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. మేము కిరాణా హిల్స్‌పై దాడి చేయలేదని” ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి(Marshal AK Bharathi) మే 12న జరిగిన విలేకరుల సమావేశంలో అని స్పష్టం చేశారు.