HomeజాతీయంRSS Chief | హిందువులు ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుంది.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

RSS Chief | హిందువులు ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుంది.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

హిందువులు ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుందని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్నారు. మణిపూర్​ పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RSS Chief | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుందన్నారు. హిందువులు లేని రోజు ప్రపంచం అంతమైపోతుందని చెప్పారు.

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) మణిపూర్​లో శనివారం మాట్లాడారు. హిందూ సమాజం ప్రపంచ మనుగడకు కేంద్రబిందువు అని పేర్కొన్నారు. హిందువులు లేకుండా, ప్రపంచం ఉనికిలో ఉండదు అని ఆయన అన్నారు. యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి పురాతన సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. హిందూ నాగరికత అమరమైనదిగా అభివర్ణించారు. మన సమాజంలో ఒక నెట్‌వర్క్‌ను సృష్టించామని, దాని కారణంగా హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. మణిపూర్ (Manipur)​లో ఇటీవల అల్లర్లు చెలరేగిన అనంతరం ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు.

RSS Chief | ఆర్థిక స్వావలంబన అవసరం

సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే కాకుండా భారతదేశం (India) ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టాలని భగవత్ కోరారు. సైనిక, జ్ఞాన సామర్థ్యాలతో పాటు దేశ నిర్మాణానికి ఆర్థిక బలం కీలకమని ఆయన పేర్కొన్నారు. జాతిని నిర్మించేటప్పుడు మొదటి అవసరం బలం అన్నారు. బలం అంటే ఆర్థిక సామర్థ్యం అని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వావలంబనగా ఉండాలని ఆకాంక్షించారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.

RSS Chief | నక్సలిజం ముగిసింది

సామాజిక సంకల్పం లోతుగా పాతుకుపోయిన సవాళ్లను ఎలా అధిగమించగలదో ఆయన పేర్కొన్నారు. నక్సలిజం క్షీణతను ఆయన ఎత్తి చూపారు. సమాజం దానిని ఇకపై సహించదని నిర్ణయించుకుందని పేర్కొన్నారు. సామాజిక ఐక్యత, స్వావలంబన, చారిత్రక పట్టుదల దేశ శాశ్వత వారసత్వానికి స్తంభాలు అని మోహన్​ భగవత్​ అన్నారు.