అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం నెగెటివ్‌గా ప్రారంభమైన ప్రధాన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
గ్లోబల్ మార్కెట్ల (Global Markets)లో బలహీనతకు తోడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకు రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. దీంతో వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 188 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 34 పాయింట్లు పెరిగింది. అయితే అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 439 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 76 పాయింట్ల నష్టంతో మొదలై 29 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 146 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 85,213 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 26,027 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,651 కంపెనీలు లాభపడగా 2,519 స్టాక్స్ నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 100 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 135 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
టెలికాం, కన్జూమర్ డ్యూరెబుల్స్ మినహా..
బీఎస్‌ఈలో టెలికాం(Telecom), కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టెలికాం ఇండెక్స్ 0.69 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.51 శాతం లాభపడ్డాయి. రియాలిటీ 1.36 శాతం, బ్యాంకెక్స్(Bankex) 1.03 శాతం, ఇన్‌ఫ్రా 0.98 శాతం, పీఎస్‌యూ 0.93 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.91 శాతం, కమోడిటీ 0.91 శాతం, ఐటీ 0.86 శాతం, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం పడిపోయాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్ 1.60 శాతం, ఎయిర్‌టెల్ 1.59 శాతం, ఎంఅండ్‌ఎం 0.45 శాతం, ఆసియా పెయింట్ 0.35 శాతం, ట్రెంట్ 0.79 శాతం లాభపడ్డాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 5.03 శాతం, ఎటర్నల్ 4.69 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.03 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.86 శాతం, టాటా స్టీల్ 1.74 శాతం నష్టపోయాయి.
