HomeజాతీయంMallojula Venugopal | పరిస్థితులు మారాయి.. మావోయిస్టులు లొంగిపోవాలి : మల్లోజుల

Mallojula Venugopal | పరిస్థితులు మారాయి.. మావోయిస్టులు లొంగిపోవాలి : మల్లోజుల

మావోయిస్టులు ఎన్​కౌంటర్లలో చనిపోవడం బాధ కలిగిస్తోందని మల్లోజుల వేణుగోపాల్​ అన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని ఆయన వారికి సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallojula Venugopal | పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్​ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్​ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

ఏపీలో మావోయిస్ట్​ అగ్రనేత హిడ్మా (Maoist Leader Hidma) ఎన్​కౌంటర్​ అయిన విషయం తెలిసిందే. దీనిపై మల్లోజుల స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. అందుకే లొంగిపోవాలని ఆయన కోరారు. కాగా.. మల్లోజుల అలియాస్​ అభయ్​ అలియాస్​ సోనూ కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించాడు. ఆయన ఇటీవల తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర సీఎంకు (Maharashtra CM) ఆయుధాలు అప్పగించి లొంగిపోయాడు. మిగతా వారు సైతం లొంగిపోవాలని కోరుతున్నారు.

Mallojula Venugopal | ఎన్​కౌంటర్​లో దేవ్​జీ హతం!

ఆంధ్రప్రదేశ్​లో (Andhra Pradesh) బుధవారం మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కీలక నేతలు హతం అయినట్లు సమాచారం. ఏడుగురు నక్సల్స్​ ఎన్​కౌంటర్​లో చనిపోయారు. జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌, సీత అలియాస్‌ జ్యోతి, సురేశ్‌, గణేశ్‌, వాసు, అనిత, షమ్మి మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. ఎన్​కౌంటర్​లో దేవ్​జీ అలియాస్​ తిరుపతి కూడా మృతి చెందినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టెక్​ శంకర్​ మృతితో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

టెక్​ శంకర్​ మావోయిస్ట్​ (Tech Shankar Maoist) ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. దాడులకు హిడ్మా వ్యూహ రచన చేసేవాడు. అయితే పేలుడు పదార్థాలు తయారు చేయడం, వాటిని అమర్చడంలో శంకర్​ పాత్ర కీలకం. దీంతోనే ఆయనను మావోలు టెక్​ శంకర్​ అని పిలిచేవారు. మందుపాతరలు, ఐఈడీలు తయారు చేయడంతో పాటు వాటిని అమర్చి ఎంతో మంది బలగాల చావుకు టెక్​ శంకర్​ కారణం అయ్యాడు.