అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | లంచం తీసుకుంటూ ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ (ACB) అధికారులకు దొరికాడు. ఈ ఘటన వరంగల్ (Warangal) పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది.
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) పోలీస్ స్టేషన్లో పి శ్రీకాంత్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తిపై ఠాణాలో కేసు నమోదు అయింది. ఆ కేసులో అతనికి నోటీసు జారీ చేయడంతో పాటు ఛార్జిషీట్‌ను త్వరగా దాఖలు చేయడానికి, జప్తు చేసిన వాహనాలను విడుదల చేయడానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth)తో పాటు అతడి ప్రైవేట్ డ్రైబర్ ఎండీ నజీర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఠాణాలో సోదాలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.