HomeజాతీయంPM Modi | రామ భక్తుల సంకల్పం సిద్ధించింది : ప్రధాని మోదీ

PM Modi | రామ భక్తుల సంకల్పం సిద్ధించింది : ప్రధాని మోదీ

అయోధ్యలో ధర్మ ధ్వజం ఆవిష్కరించడంతో రామభక్తుల సంకల్పం సిద్ధించిందని ప్రధాని మోదీ అన్నారు. కాషాయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple)లో కాషాయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రోజు సంపూర్ణ విశ్వం రామమయం అయిందన్నారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని పేర్కొన్నారు.

ధర్మధ్వజం (Dharmadhwajam) కేవలం జెండా కాదని, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని మోదీ అన్నారు.రాముడు భావోద్వేగాల ద్వారా ఐక్యమవుతాడు, విభజన ద్వారా కాదు అని అప్రధానమంత్రి అన్నారు. భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు సప్త మండపాన్ని సందర్శించాలని సూచించారు. ఈ మండపాలు విశ్వాసం, స్నేహం, విధి, సామాజిక సామరస్యం విలువలను బలోపేతం చేస్తాయన్నారు.

PM Modi | సత్యమే గెలుస్తుంది

జీవితం నశించి పోయినా.. మాట తప్పొద్దని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. జెండాపై చిత్రించిన సూర్యవంశ వంశం కీర్తి, ఓం పదం, కోవిదార్ చెట్టు రామరాజ్య వైభవాన్ని సూచిస్తాయన్నారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన భక్తులకు నివాళులు అర్పించారు. ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందన్నారు. ధర్మ ధ్వజం పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి, వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

500 ఏళ్ల తర్వాత హిందూ సమాజం చివరకు మన సత్యాన్ని స్థాపించిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. దీని కోసం చాలా మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. వారి ఆత్మలు ఈ రోజు శాంతిని పొందాయని తెలిపారు. మందిర్ నిర్మాణం పూర్తవడంతో తమ ప్రయత్నాలన్నీ అర్థవంతంగా మారాయని పేర్కొన్నారు. అయోధ్య నేడు విశ్వాసపు నూతన యుగంలోకి ప్రవేశించిందని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. అయోధ్య రామమందిరం 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.