PSLV C-62 | పీఎస్​ఎల్​వీ సీ–62 ప్రయోగం విఫలం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PSLV C-62 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్​ఎల్​వీ సీ–62 ప్రయోగం విఫలమైంది. సోమవారం ఉదయం 10:17 ​ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నాలుగో దశలో ఫెయిల్ అయింది. ఇస్రో 2026 చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. EOS-N1 ఉపగ్రహంతో పాటు మరో 15 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి పీఎస్​ఎల్​వీ రాకెట్ (PSLV Rocket)​ను ప్రయోగించింది. ఈఓఎస్-ఎన్1 అన్వేష అనే హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాన్ని డీఆర్​డీవో దేశ రక్షణ కోసం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PSLV C-62 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్​ఎల్​వీ సీ–62 ప్రయోగం విఫలమైంది. సోమవారం ఉదయం 10:17 ​ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నాలుగో దశలో ఫెయిల్ అయింది.

ఇస్రో 2026 చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. EOS-N1 ఉపగ్రహంతో పాటు మరో 15 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి పీఎస్​ఎల్​వీ రాకెట్ (PSLV Rocket)​ను ప్రయోగించింది. ఈఓఎస్-ఎన్1 అన్వేష అనే హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాన్ని డీఆర్​డీవో దేశ రక్షణ కోసం తయారు చేసింది. అయితే విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నాలుగో దశలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడంలో విఫమైంది.

PSLV C-62 | మూడు దశలు విజయవంతం

సతీశ్​ దావన్​ స్పేస్​ సెంటర్​ (Satish Dhawan Space Centre) నుంచి పీఎస్​ఎల్వీ సీ–62 ప్రయోగం చేపట్టారు. తొలిదశలో 116 కిలోమీటర్ల ఎత్తులో రక్షణ కవచమైన “నోస్ కోన్” వేరు చేయబడింది. రెండో దశలో వికాస్ ఇంజిన్ విజయవంతంగా మండింది. మూడో దశలో ఘన ఇంధన దహన ప్రక్రియను పూర్తి చేసుకుని రాకెట్​ వేరు చేయబడింది. పీఎస్ఎల్‌వీ రాకెట్ యొక్క అత్యంత శక్తివంతమైన ఘన ఇంధనంతో పనిచేసే మూడవ దశ విజయవంతంగా విడిపోయింది. కాగా 2025లో పీఎస్​ఎల్వీ రాకెట్​ మూడో దశలో విఫలమైంది. తాజాగా మూడో దశ విజయవంతం కాగా.. నాలుగో దశలో ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహాలను నిర్ణిత కక్షలో ప్రవేశ పెట్టడంతో ఫెయిల్ అయింది. ప్రయోగం ఫెయిల్​ అయినట్లు ఇస్రో ఛైర్మన్​ (ISRO Chairman) ప్రకటించారు. నాలుగో దశ ప్రారంభంలోనే శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయానని చెప్పారు. మూడో దశ చివర్లో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నామని ప్రకటించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.