అక్షరటుడే, వెబ్‌డెస్క్: PSLV C-62 | శ్రీహరికోటలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. PSLV -C62 రాకెట్ (PSLV-C62 rocket) ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది.
పీఎస్ఎల్వీ సీ–62 రాకెట్ ప్రయోగం సోమవారం ఉదయం 10:17 గంటలకు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమైంది. ఈ రాకెట్ 7 స్వదేశీ , 8 విదేశీ మైక్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టనున్ఆరు.
PSLV C-62 | 18 ఉపగ్రహాలను..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ మిషన్ అధునాతన హైపర్‌స్పెక్ట్రల్ భూ పరిశీలన ఉపగ్రహమైన EOS-N1 (అన్వేష)తో పాటు 18 చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. EOS-N1 అధునాతన ఇమేజింగ్ సెన్సార్లు నిఘా, పర్యావరణ పర్యవేక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయని ఇస్రో పేర్కొంది. తాజా ప్రయోగం PSLV 64వది అవుతుంది. 2025 మే లో ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ ప్రయోగం మూడో దశలో విఫలం అయింది. దీంతో తాజాగా PSLV లాంచర్‌పై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి PSLV-C62 ప్రయోగం చేపట్టారు.
PSLV C-62 | అన్వేషతో నిఘా
ఈ రాకెట్‌తో EOS-N1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ శాటిలైట్‌కు అన్వేష అనే పేరు పెట్టారు. దీనిని భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) కోసం రూపొందించారు. జాతీయ భద్రత, సరిహద్దుల భూ పరిశీలనకు ఇది ఉపయోగ పడుతుంది.